రంగస్థలం... రామ్ చరణ్ కెరీర్లో ది బెస్ట్ సినిమా. చరణ్‌లో ఇంత మంచి నటుడున్నాడా? అని ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా. ఈ సినిమాతో రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డు వస్తుందని అంతా ఆశించారు. కానీ.. రాలేదు. అప్పట్లో చాలామంది మెగా ఫ్యాన్స్ చరణ్‌కి అవార్డు రావకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అయితే.. చరణ్‌కి అవార్డు రాకపోవడం పట్ల ఓ హీరో.. బహిరంగంగా ఇప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనే.. మంచు విష్ణు.
రంగస్థలంలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని, తనకు నేషనల్ అవార్డు రావాల్సిందని, కానీ రాకపోవడం తనని చాలా నిరాశ పరిచిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు విష్ణు. కామెడీ, యాక్షన్ సినిమాలు అందరూ చేస్తారని, కానీ అలాంటి సినిమాలు చేయడం కష్టమని - చరణ్‌కి అవార్డు రాకపోవడం వల్ల `నాకెక్కడో కాలింద`ంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.
ఓ హీరోకి అవార్డు ఇవ్వకపోవడం పట్ల బహిరంగంగా ఇలా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. చరణ్ - విష్ణు మంచి దోస్తులు. మోహన్ బాబు కుటుంబానికీ - చిరు కుటుంబానికీ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. ఆ అనుబంధంతోనే.. విష్ణు ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటాడు.