తెలుగులో జోరు చూపిస్తున్న బాలీవుడ్‌ 'ఆంటీ'.!

మరిన్ని వార్తలు

పూరీ జగన్నాధ్‌ అండ్‌ టీమ్‌ ప్రస్తుతం గోవాలో సందడి చేస్తోంది. పూరీ తెరకెక్కిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' షూటింగ్‌ గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు పూరీ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా, పూరీ కథ, స్క్రీన్‌ప్లేతో రూపొందుతోన్న 'రొమాంటిక్‌' మూవీ కూడా అక్కడే షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' అండ్‌ 'రొమాంటిక్‌' టీమ్స్‌ కలిసి సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

 

ఈ ఫోటోల్లో బాలీవుడ్‌ ఆంటీ మందిరాబేడీ కనిపించింది. బాలీవుడ్‌లో నటిగా ఓ మోస్తరు పేరున్న మరదిరా బేడి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తోంది. తాజాగా పూరీ టీమ్‌తో కలిసి కనిపించింది. అంటే పూరీ రూపొందిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో కానీ, 'రొమాంటిక్‌'లో కానీ మందిరా బేడీ నటించనుందనీ తెలుస్తోంది. 

 

ఏ సినిమాలో నటిస్తోందనే క్లారిటీ లేదు కానీ, ఏదో ఒక సినిమాలో మందిరా బేడీ నటిస్తుందని మాత్రం తెలుస్తోంది. మందిరాబేడీ జోరు చూస్తుంటే, తెలుగులో వరుసగా నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో సినిమాలతో కన్నా, సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలతోనే ఎక్కువగా మందిరా బేడీ సుపరిచితురాలు. ఇకపై తెలుగులో మంచి మంచి పాత్రలను ఎంచుకునే దిశగా మందిరా బేడీ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవ్వాలని ఆశిద్దాం.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS