'మణికర్ణిక' సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరబోతోందట. అదీ కొద్ది రోజుల్లోనే. అసలిది సాధ్యమయ్యేనా.? ట్రెండ్ చూస్తుంటే మాత్రం కొంచెం కష్టమైన పనే అనిపిస్తోంది. కానీ అదృష్టం కలిసొస్తే, కంగనా 100 కోట్లు కొల్లగొట్టేయచ్చు. ప్రస్తుతానికి అయితే 50 కోట్లకు దగ్గరగా ఉందట 'మణికర్ణిక'. ఈ రోజు వర్కింగ్ డే కావడంతో చాలా చోట్ల డ్రాప్స్ కనిపించాయి. రేపు, ఎల్లుండి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ వీక్ అంతా నిలదొక్కుకుంటే, 100 కోట్లు క్లబ్‌లోకి ఈజీగా చేరొచ్చు.
కానీ అదేమంత సులువైన విషయం కాదని ట్రేడ్ పండితులు అంటున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన మణికర్ణికను చివర్లో కంగనా కెలికేయడంతోనే ఈ దుస్థితి అని ఓ అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సినీ పరిశ్రమలో ఇలాంటి వాదనలు మామూలే. సినిమా ఒకవేళ హిట్ అయి ఉంటే, కంగనా ఓ రేంజ్‌లో హడావిడి చేసేది. కానీ ఇప్పుడెక్కడా ఈ సినిమా గురించి మాట్లాడేందుకు సాహసించడం లేదు కంగనా.
అంతేకాదు, సినిమా గురించి నెగిటివ్‌గా మాట్లాడడం మంచిది కాదంటూ తన సోదరి ద్వారా క్రిష్‌కి ఝలక్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది కంగనా రనౌత్. సినిమా నిర్మాణం సందర్భంగా కంగనా చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని పరోక్షంగా నిర్మాత కమల్ జైన్ కూడా ఒప్పుకున్నారు. ఓ నెటిజన్ కంగనా రనౌత్‌ని దెయ్యంగా అభివర్ణిస్తే, కమల్ జైన్ దానికి లైక్ కొట్టడం పెను దుమారమైంది. సినిమాపై నెగిటివ్ టాక్ ఎలా ఉన్నా ఏదో ఒకరకంగా 'మణికర్ణిక' వార్తల్లో ఉండడం సినిమా పబ్లిసిటీకి బాగానే ఉపయోగపడుతోంది.