హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2` కొత్త షెడ్యూల్‌

By iQlikMovies - May 21, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు. నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ స‌హా న‌టీన‌టులంద‌రూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుగ‌ల్‌ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా పూర్తి చేసింది.

 

త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS