బాలయ్యపై మళ్లీ నాగబాబు ఫైర్‌: ఏంటీ పీకుడు.!

మరిన్ని వార్తలు

అమితాబ్‌ బచ్చన్‌ ఏం పీకాడు.. అన్న కామెంట్‌కి ఇది నా సమాధానం అంటూ కామెంట్‌ నెం 3ని స్టార్ట్‌ చేశారు మెగా బ్రదర్‌ నాగబాబు. మీ నాన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు అంతటి గొప్ప వ్యక్తి అమితాబ్‌ బచ్చన్‌. అలాగే తమిళంలో ఎంజీఆర్‌, కన్నడలో రాజ్‌కుమార్‌ తదితర స్టార్స్‌ కూడా మీ నాన్నగారి వయసున్న వ్యక్తులే. అంతటి గొప్పతనం ఉన్న వ్యక్తులే. అలాంటప్పుడు వారిని కామెంట్‌ చేయడం తప్పు. 

 

అయినా ఆ టాపిక్‌లోకి మా ప్యామిలీ పేరును తీసుకురావడం అవసరమా.? అని ప్రశ్నించారు. ఇక మా బ్లడ్‌ వేరు, మా బ్రీడ్‌ వేరు అనడానికి మీరేమైనా ఆకాశం నుండి దిగొచ్చారా.? సూర్యవంశ రాజులా.? అందరిలానే సామాన్య తల్లితండ్రులకు పుట్టినవాళ్లే. అలా అని ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడితే మేం ఊరుకోం. మా అన్నయ్య చిరంజీవి కానీ, పవన్‌ కళ్యాణ్‌ కానీ ఇలాంటి కామెంట్స్‌ని పట్టించుకోరు. తిరిగి కామెంట్స్‌ చేయరు. చరణ్‌ కానీ, వరుణ్‌ కానీ ఇలా ఎవరైనా అసలు మా ఫ్యామిలీనే కాంట్రవర్సీల జోలికి పోదు. 

 

కానీ ఇలా పదే పదే అవమానించడం కరెక్ట్‌ కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా చివరి దశలో మీ నాన్నగారు ఎన్టీఆర్‌ సొంత వ్యక్తుల నుండి వెన్నుపోటుకు గురయ్యారు. ఆ టైంలో మీరు ఏం చేశారు.? అని డైరెక్ట్‌గా బాలయ్యను ప్రశ్నించారు మెగా బ్రదర్‌. వరుస కామెంట్లతో ఇలా మెగా బ్రదర్‌ బాలయ్యపైనా, ఆయన ఫ్యాన్స్‌ పైనా ఫైర్‌ అవుతుండడంతో సోషల్‌ మీడియాలో ఈ రచ్చ సెగలు కక్కేస్తోందిప్పుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS