చిన్నారి ప్రాణాలు కాపాడిన ఫైర్ మెన్ ను అభినందించిన మెగాస్టార్

మరిన్ని వార్తలు

భారీ వర్షాలు సందర్భంగా ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే శ్రీ క్రాంతి కుమార్ ను అభినందించారు.

 

ఫైర్ మ్యాన్ క్రాంతి కుమార్ కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా మేనేజింగ్ ట్రస్టు శ్రీ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. శ్రీ క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ స్టేషన్ ఫైర్ ఆపరేటర్ శ్రీ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. 

 

అదే విధంగా రక్షింపబడ్డ 4సంవత్సరాల బాలికను కూడా ఆదుకుంటామని శ్రీ అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS