కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న తూనీగ పాప.!

మరిన్ని వార్తలు

'తూనీగా తూనీగా' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బక్క పలచని అందాల భామ రియా చక్రవర్తి. తొలి సినిమాతో ఓకే అనిపించుకున్నా, అమ్మడిని పెద్దగా పట్టించుకోలేద ఆ తర్వాత టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తెలుగులో మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తోంది. కళ్యాణ్‌దేవ్‌ రెండో సినిమా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం తూనీగ పాపని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. 

 

ఇదిలా ఉంటే, తాజాగా అమ్మడు తమిళంలో ఓ మంచి ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. హరీష్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'ధనుష్‌ రాశి నేయర్‌గళే' చిత్రంలో రియాని హీరోయిన్‌గా ఎంచుకున్నారట. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కీ చోటుంది. అయితే ఆ హీరోయిన్‌ పేరు ఇంకా తెలియ రాలేదు. ఇకపోతే రియా చక్రవర్తికి బాలీవుడ్‌తోనూ పరిచయముంది. హీరోయిన్‌గా కెరీర్‌ని టాలీవుడ్‌లో స్టార్ట్‌ చేసినా, తన ఫిగరూ, పర్సనాలిటీ బాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్‌ చేస్తుందనే నమ్మకంతో అక్కడ పాగా వేయాలని భావించింది. 

 

కానీ అక్కడ కూడా అమ్మడికి ఆశించిన స్థాయిలో క్రేజ్‌ దక్కలేదు. దాంతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ని బాగా వాడేసుకునేందుకు సిద్ధపడింది. హాట్‌ పిక్స్‌తో, బికినీ సొగసులతో పిచ్చ పిచ్చగా రెచ్చిపోయి మరీ ఫోటో సెషన్స్‌ చేయించుకుంటుంది. ఆ పిక్స్‌ నెట్టింటిని కాక రేపుతూ ఉంటాయి. ఏది ఏమైతేనేం సోషల్‌ మీడియాలో పాప రేపిన కాకకి ఫలితం దక్కిందనుకోవాలి తాజా ఆఫర్స్‌తో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS