'రత్తాలు..రత్తాలు.. ఓసోసి రత్తాలు..' అంటూ మెగాస్టార్‌తో చిందేసి, మెగా ఐటెం గాళ్ అయిపోయింది టాలీవుడ్‌కి ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్. హీరోయిన్గా అంతంత మాత్రమే ఉన్న ఆమె పాపులారిటీ ఈ సాంగ్‌తో అమాంతం పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్లో సందడి చేస్తోంది ఈ బ్యూటీ. ఇన్నాళ్లూ అక్కడ 'జూలీ - 2' సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా రత్తాలుకి 50వ సినిమా. అయితే బాలీవుడ్లో మొదటి సినిమా. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా లక్ష్మీరాయ్‌కి విషెస్ అందించారు. 'సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.. అన్ని భాషల్లో సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి మైలుస్టోన్లు మరిన్ని అధిరోహించాలి లక్ష్మీరాయ్.. లవ్ యూ..' అంటూ చిరంజీవి లక్ష్మీరాయ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగా అభినందనలకు లక్ష్మీరాయ్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది.
ఇకపోతే ఇదో బోల్డ్ కంటెన్ట్ మూవీ. అయితే ఓ పాపులర్ నటి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంలో భాగంగా ఆ నటి ముద్దుగుమ్మ సీనియర్ నటి నగ్మా అంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్లో ఇదో రచ్చగా మారింది. అయితే ఈ విషయంలో సినీ నటి నగ్మా చాలా హుందాగా స్పందించింది. సినిమా విడుదల దగ్గర పడిన ఈ టైంలో సినిమా గురించి ఇలాంటి ప్రచారాలు రావడం భావ్యం కాదు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ సినిమా చిత్రీకరణ జరిగినా ఇప్పుడు చేసేదేమీ లేదు. సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం అని స్పందించింది.
నగ్మా హుందా అయిన వ్యాఖ్యలకు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. గతంలో నేహా ధూపియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జూలీ' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం 'జూలీ - 2'.