ముద్దుగుమ్మ మెహ్రీన్‌కి ఎంట్రీ ఘనంగా ఉన్నప్పటికీ, కంటిన్యూషన్ మాత్రం బ్యాడ్‌గానే నడిచింది. 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ తర్వాత చాలా గ్యాప్ తీసేసుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలతో వచ్చింది. కానీ, ఒకటీ, అరా తప్ప పెద్దగా సక్సెస్ అందుకోలేదు ఆ చిత్రాలు.తెలుగులోనే
కాదు, తమిళంలోనూ మెహ్రీన్ పలు చిత్రాల్లో నటించింది. నటిస్తూనే ఉంది. గతంలో సందీప్‌కిషన్‌తో తమిళంలో నటించిన 'కేరాఫ్ సూర్య' సినిమాలో మెహ్రీన్ సీన్స్‌ని కట్ చేసేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది మెహ్రీన్. ఇలాంటి పరిస్థితి ఓ ఆర్టిస్ట్‌కి ఎంత బాధాకరమైన విషయమో, అది అనుభవించిన వారికే తెలుస్తుంది అంటోంది ముద్దుగుమ్మ మెహ్రీన్. మామూలుగా అయితే కమెడియన్లకు సంబంధించి.. ఇలాంటి పరిస్థితులు తలెత్తడం సహజమే.
గతంలోపలువురు కమెడియన్లు తమ సీన్ల తొలగింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ఆర్టిస్టుకే అంత బాధనిపిస్తే, ఇక హీరోయిన్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇదిలా వుంటే, ఈ ఏడాది తెలుగులో 'ఎఫ్ 2' సినిమా మెహ్రీన్‌కి మంచి హిట్ ఇచ్చింది. ఈ హిట్ ఆమె కెరీర్‌కి బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. కళ్యాణ్‌రామ్‌తో 'రావణ' చిత్రంలోనూ, నాగశౌర్యతో 'అశ్వధ్ధామ' చిత్రాల్లోనూ మెహ్రీన్ నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. తమిళంలో అయితే, ధనుష్ హీరోగా నటిస్తున్న పటాస్ సినిమాలో మెహ్రీన్ నటిస్తోందిప్పడు