ముందుగా అనుకున్న ప్రాజెక్ట్స్ నుండి ఆర్టిస్టులు తప్పుకుంటే, చాలా ప్రాబ్లెమ్ అవుతుంది. కానీ, ఈ మధ్య మన తెలుగు సినిమాలో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువైపోయాయ్. కారణాలు అనేకం కానీ, ఇష్యూ అయితే సేమ్. ఓంకార్ తెరకెక్కించబోయే 'రాజుగారి గది 3' నుండి మిల్కీ బ్యూటీ అవుట్ అయిపోయింది. ఆ వెంటనే, 'సరిలేరు నీకెవ్వరు' ప్రాజెక్ట్ నుండి జగ్గూభాయ్ తప్పుకున్నారు. ఈ రెండు ఇష్యూస్‌లోనూ కారణాలున్నాయి.
తమన్నాకి సెట్స్‌లోకెళ్లాక స్క్రిప్టు నచ్చకపోవడం ఓ కారణమైతే, జగ్గూభాయ్ తప్పుకోవడం వెనక అనుమానాలతో కూడిన కొన్ని బలమైన కారణాలే ఉండడంతో కొంత వివాదాస్పదమైంది. కానీ, ఈ విషయంలో ఇటు చిత్ర యూనిట్, అటు జగ్గూభాయ్ ప్రత్యక్షంగా వివరణ ఇచ్చేయడంతో ఈ ఇష్యూ అక్కడితో సద్దు మనిగిపోయింది. అయితే, తాజాగా మరో నటుడు రావు రమేష్, బన్నీ సినిమా నుండి తప్పుకున్నారనే వార్త బయటికి వచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అనుమానించాల్సిన రీజన్సేమీ లేవని తెలుస్తోంది.
బన్నీ సినిమా సెట్స్ మీదికెళ్లేందుకు, అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకోవడంతో రావు రమేష్ డేట్స్ అడ్జస్ట్ కాలేదట. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన చాలా బిజీ అన్న సంగతి తెలిసిందే. సో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనే, ఈ సినిమా నుండి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్‌తో ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేశారట త్రివిక్రమ్ అండ్ టీమ్. అయితే, త్రివిక్రమ్ సినిమాలకు రావురమేష్ సెంటిమెంట్ కూడా ఉంది. త్రివిక్రమ్ - రావు రమేష్ కాంబోలో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. మరి తాజా సినిమాలో రావు రమేష్ లేకపోవడం ఓ లోటుగానే భావించాలి.