తెలుగు ‘పింక్‌’లో అవి కూడా ఉంటాయట.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘పింక్‌’ తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాని రీమేక్‌ చేస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏమీ ఉండవనుకుంటున్నారు. కానీ, తెలుగు వెర్షన్‌ వచ్చేసరికి అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌నీ యాడ్‌ చేస్తున్నారట. వాస్తవానికి బాలీవుడ్‌లో కమర్షియల్‌ యాంగిల్‌ ఏమీ ఉండదు. అలాగే కోలీవుడ్‌లో అజిత్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పింక్‌’ రీమేక్‌ ‘నేర్కొండ పార్వై’ లోనూ కమర్షియల్‌ యాంగిల్‌ కనిపించదు. చెప్పాలనుకున్న కథని సీరియస్‌ మోడ్‌లో డైరెక్ట్‌గా చెప్పేశారు.

 

పాత్రల ప్రాధాన్యతకు మాత్రమే ఎక్కువ వేల్యూ ఇచ్చి రూపొందించారు. కానీ, పవన్‌ కళ్యాణ్‌ అంటే, కమర్షియల్‌ యాంగిల్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. సో ఫ్యాన్స్‌ ఏమాత్రం హర్టవ్వకుండా తెలుగు వెర్షన్‌ ‘పింక్‌’ని కమర్షియల్‌ ప్యాక్డ్‌ పవర్‌ ఫుల్‌ స్టోరీగా రూపొందిస్తున్నారట. ఈ సినిమాకి తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. అంజలి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘లాయర్‌ సాబ్‌’, ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. ఉగాదికి టైటిల్‌ కన్‌ఫామ్‌ చేయనున్నారట. సమ్మర్‌కి ధియేటర్స్‌లో సందడి చేయనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS