'సుప్రీమ్' సినిమాతో మాస్ హీరోగా స్థానం పదిలపరచుకున్నాడనుకున్న తరుణంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తూ, కథల ఎంపికలో లైట్ తీసుకుని, ఫెయిల్యూర్స్ బాట పట్టాడు. వరుస ఫెయిల్యూర్స్ తేజు మార్కెట్‌ని పూర్తిగా డౌన్ ఫాల్ చేసేసింది. ఎలాగోలా 'చిత్రలహరి' సినిమాతో ఇటీవల తేజు మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఇలా ఎక్కిన ట్రాక్‌లో ప్రయాణం మరీ సూపర్ ఫాస్ట్‌గా కాకుండా, కాస్త ఆచి తూచి నిర్ణీత వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్లాలనుకుంటున్నాడట.
అందుకే అస్సలు తొందరపడడం లేదు. మూస కథల జోలికి ఇంకస్సలే పోవడం లేదు. డిఫరెంట్ స్టోరీస్‌ని ఎంచుకుంటున్నాడట. ఆ దిశగా మారుతి దర్శకత్వంలో 'ప్రతీ రోజూ పండగే' సినిమాలో నటిస్తున్నాడు. మారుతి సినిమాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి రూపొందిస్తుంటాడు. అలాగే తేజు కోసం ఓ డిఫరెంట్ స్క్రిప్టునే సిద్ధం చేశాడు. ఇదిలా ఉంటే, తేజు మరోవైపు వెర్సటైల్ డైరెక్టర్ దేవా కట్టాతో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.
ఇది కూడా విభిన్న తరహా ప్రాజెక్టే. గతంలో 'ప్రస్థానం' వంటి సూపర్ క్లాసిక్ హిట్ ఉంది దేవా కట్టాకి. అలాంటి డైరెక్టర్‌తో తేజు మూవీ అంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏది ఏమైనా తేజులో మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది. మరక మంచిదేలా.. మార్పు మంచిదే. ఈ మార్పు తేజుని సక్సెస్‌ల దిశగా పరుగులు పెట్టిస్తే ఇంకా మంచిదే.