మెహరీన్‌కి సారీ చెప్పిన డైరెక్టర్‌

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ మెహరీన్‌ కౌర్‌ తాజాగా 'కేరాఫ్‌ సూర్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ముద్దుగుమ్మ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, సినిమాలో అందంగా గ్లామర్‌ ఒలకబోస్తూ కనిపించింది. అయితే సినిమా రిలీజ్‌ అయ్యాక సినిమాలో చాలా వరకూ సీన్స్‌ని తొలిగించేశారట. సినిమా స్లోగా ఉన్నది అన్న రిపోర్ట్స్‌ రావడం కారణంగానే రిలీజ్‌ అయినాక సినిమాలోని కొన్ని సీన్స్‌ని తీసేశామని చిత్ర యూనిట్‌ చెబుతోంది. అయితే ఈ తీసేసిన సీన్స్‌లో ఎక్కువ భాగం హీరోయిన్‌ మెహరీన్‌ సీన్సే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. 

అందుకే డైరెక్టర్‌ ఈ విషయంలో హీరోయిన్‌ మెహరీన్‌కి క్షమాపణ చెప్పారు. సుశీంద్రన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కార్తీతో తెరకెక్కిన 'నా పేరు శివ' సినిమా తరహా క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించాడు. 'శమంతకమణి'తో మెప్పించిన సందీప్‌ కిషన్‌కి ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. కానీ ఆశించిన విజయాన్ని అయితే అందివ్వలేకపోయింది. కాగా సినిమా రిలీజ్‌ అయ్యాక సీన్స్‌ తొలిగించేయడం అంటే ఒకింత బాధ పడాల్సిన విషయమే. అందులోనూ హీరోయన్‌ సీన్స్‌ లేపేయడం అంటే మరీను. అయినా కానీ టోటల్‌గా సినిమా సక్సెస్‌ కోసం ఇలా చేయక తప్పలేదు. అయితే ఆ తర్వాత అయినా సినిమా టాక్‌లో ఛేంజ్‌ వస్తుందేమో చూడాలి మరి. 

మెహరీన్‌, సాయి ధరమ్‌ తేజ్‌తో 'జవాన్‌' సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. బి.వి.ఎస్‌.రవి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇంతవరకూ వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యూటీ మెహరీన్‌ హీరోయిన్‌గా పెద్దగా మార్కులేయించుకోలేకపోయింది. ఇక ఈసారి మెగా హీరోతో వచ్చేస్తోంది. ఈ సినిమా అయినా మెహరీన్‌కి చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS