పాప బాగా హర్టయ్యిందట పాపం

మరిన్ని వార్తలు

2017లో ముద్దుగుమ్మ మెహరీన్‌ వరుస సినిమాలతో ఆకట్టుకుంది. కానీ వరుస సక్సెస్‌లు అయితే ఆమె ఖాతాలో వేసుకోలేకపోయింది. 'మహానుభావుడు' సినిమా ఒక్కటే మెహరీన్‌ ఖాతాలో సక్సెస్‌ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ బిజీ షెడ్యూల్స్‌ కారణంగానే ఈ ముద్దుగుమ్మ ఫిజిక్‌పై కాన్‌సన్‌ట్రేషన్‌ చేయలేకపోయింది. దాంతో మొదట్లో ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ అందం కాస్తా భారీతనంగా మారిపోయింది. దాంతో రావాల్సిన చాలా ఆఫర్లు చేయి జారిపోయాయనే టాక్‌ వినిపిస్తోంది. 

అవకాశాలు చేజారిపోయాక కానీ అమ్మడికి ఆ నష్టం సంగతి తెలియలేదు కాబోలు. ఇప్పుడు కష్టపడి వర్కవుట్లు చేసి ఒళ్లు తగ్గించింది. తగ్గించడమే కాదు, ఇదిగో నేను ఒళ్లు తగ్గించి స్లిమ్‌గా తయారయ్యానే అంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేసి మరీ, స్లిమ్‌ అయ్యిందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ, గతంలో భారీ కాయం కారణంగా వదులుకున్న ఛాన్సుల సంగతేంటి అని అడుగుతుంటే, ఆ విషయం గురించి మాట్లాడేందుకు అమ్మడు ఇష్టపడడం లేదట. 

అయినా కానీ ఆ నోటా ఈ నోటా ఎలాగోలా ఆ మాటలు బయటికి వచ్చేశాయి. అప్పట్లో యంగ్‌ హీరోస్‌ రామ్‌తోనూ, నితిన్‌తోనూ నటించే ఛాన్స్‌ మెహరీన్‌కి మిస్‌ అయ్యిందట. తీరా ఈ విషయాలు వెలుగు చూసేసరికి మెహరీన్‌ డ్యామేజ్‌ కంట్రోల్‌కి దిగింది. అలా నేను ఏ ఛాన్సులూ వదులుకోలేదు అని చెబుతోంది. నిజానికి అన్ని ఛాన్సులు ఒకేసారి వచ్చినందుకు మెహరీన్‌ దశ తిరిగిపోవాలి. కానీ కేవలం బరువు పెరిగిపోవడం వల్లే ఈ ముద్దుగుమ్మ అంతగా పాపులర్‌ కాలేదు. 

ప్రస్తుతం గోపీచంద్‌తో 'పంతం' సినిమాలో నటిస్తోంది మెహరీన్‌. ఈ డ్యామేజ్‌ కంట్రోల్‌ మెహరీన్‌కి ఇప్పటికైనా వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS