అందాల భామ ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాట్ న్యూస్కెక్కింది. ఎందుకంటారా? అస్సాం టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఓ ప్రకటనలో ప్రియాంకా చోప్రా హాట్ హాట్‌గా అందాలారేసిందంటూ, ఆ క్యాలెండర్‌కి అంత హాట్నెస్ అవసరం లేదంటూ ఆమెపై నెటిజన్లు కామెంట్స్ గుప్పిస్తున్నారు. వెంటనే ఆ ప్రకటన నుండి ప్రియాంకా ఫోటోను తొలిగించాలంటూ రాద్ధాంతం చేస్తున్నారు.
అయినా ఆ ఫోటోలో ప్రియాంకా ఏమంత హాట్‌గా కనిపించిందో కామెంట్ చేసిన వారికే తెలియాలి. ప్రియాంకా చోప్రా హాట్నెస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఈ ప్రకటన విషయంలో కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రియాంకా గతంలో చాలా సార్లు చాలా సందర్భాల్లో అన్‌లిమిటెడ్‌గా హాట్నెస్ ప్రదర్శించేసింది. క్లీవేజ్ ఫోటోలు, బికినీ షోలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఏం చెప్పగలం ప్రియాంకా అందాల దాడి గురించి. అయితే వాటితో పోల్చితే, ఈ ప్రకటనకు వేసిన ఫోటోలో ఏమంత హాట్‌గా కనిపించడం లేదు ప్రియాంకా.
అసలు వివరాల్లోకి వెళితే, ప్రియాంకా హాట్నెస్ రాద్ధాంతం సెగలు అస్సాం అసెంబ్లీ దాకా పాకేశాయి. అస్సాం అసెంబ్లీలో ఎమ్యెల్యేలు, టూరిజం క్యాలెండర్‌పై ప్రియాంకా కాస్ట్యూమ్ హాట్‌గా ఉందనీ, ఆమెను ఆ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలనీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంకకు టూరిజం మినిస్టర్ మద్దుతుగా నిలిచారు. కానీ ఈ వివాదం ఆగలేదు. రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించిన ఆ క్యాలెండర్లో సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే మంచిదని ఎమ్యెల్యేలు అభిప్రాయ పడుతూ, ఈ విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.
చూడాలి మరి అందాల ప్రియాంకా ఈ వివాదం నుండి ఎలా బయట పడుతుందో!