ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన #GST చిక్కులు తన మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ GST వీడియో కి సంబంధించి పోలీసులు ఆర్జీవీని విచారించడం అలాగే వచ్చే వారం కూడా మరోసారి విచారణకి హాజరుకమ్మని ఆదేశించారు. ఈ తరుణంలో కీరవాణి ఈ వీడియోకి సంగీతం సమకూర్చడం వల్ల ఆయనకి కూడా పోలీసులు నుండి నోటీసులు అందుతాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ నోటీసులు కీరవాణి తో సహా ఈ వీడియో కోసం పనిచేసిన వారందరికీ ఇచ్చే యోచనలో విచారణ అధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే నేటి ఉదయం వర్మ తనపైన దుష్ప్రచారం ఒక టీవీ ఛానల్ చేస్తున్నది అంటూ ఆ ఛానల్ పైన లీగల్ గా చర్యలు తీసుకుంటాను అని తెలిపారు.
ఈ చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారేలాగా కనిపిస్తున్నది.