త‌మ‌న్నా పెద‌వి కొర‌కాలంటే.. ఆ హీరో రావాల్సిందే!

By Gowthami - March 02, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

లిప్‌లాక్ సీన్ అనేది ఇప్ప‌ట్లో చాలా కామ‌న్‌. అగ్ర క‌థానాయిక‌లు అలాంటి స‌న్నివేశాల్లో క‌నిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కాజ‌ల్‌, స‌మంత‌, ర‌కుల్‌.. ఇలాంటి వాళ్లంతా ఈ స‌న్నివేశాల్లో త‌డిచి ముద్ద‌యిన‌వాళ్లే. అయితే త‌మ‌న్నా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ లిప్ లాక్‌ల‌లో క‌నిపించ‌లేదు. 'ఈ సినిమాలో లిప్ లాక్ లు ఉండ‌వు' అనే ష‌ర‌తుమీదే త‌మ‌న్నా సినిమాలు ఒప్పుకుంటుంద‌ట‌. 

 

అయితే.. ఓ హీరోతో మాత్రం లిక్ లాక్ చేయ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదంటోంది. ఆ హీరోతో త‌ప్ప మ‌రెవ్వ‌రితోనూ లిప్‌లాక్ స‌న్నివేశాల్లో న‌టించ‌ను అని నిర్మొహ‌మాటంగా చెప్పేస్తోంది. ఆ హీరో ఎవ‌రో కాదు... హృతిక్ రోష‌న్‌. హృతిక్‌కి త‌మ‌న్నా పెద్ద ఫ్యాన్ అట‌. త‌న‌ని ఎప్పుడు చూసినా ఆశ్చ‌ర్య‌పోతుంటాన‌ని, నోట మాట రాకుండా నిల‌బ‌డిపోతాన‌ని చెప్పుకొస్తోంది త‌మ‌న్నా. 

 

ఓసారి హృతిక్‌ని క‌లిసి... ''నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని'' అని ప‌రిచ‌యం చేసుకుని ఓ ఫొటో కూడా తీసుకుంద‌ట‌. ఆ ఫొటోని ఇప్ప‌టికీ అపురూపంగా చూసుకుంటానంటోంది మిల్కీ బ్యూటీ. అంటే... త‌మ‌న్నా పెద‌వి కొర‌కాలంటే.. ఆ బాలీవుడ్ కండ‌ల వీరుడు దిగి రావాల్సిందే అన్న‌మాట‌. మ‌రి ఆ అవ‌కాశం ఉందో, లేదో..??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS