పెళ్లి నా పర్సనల్‌ అంటోన్న ఊర్మిళ

మరిన్ని వార్తలు

గ్లామర్‌ క్వీన్‌గా పలు చిత్రాల్లో నటించి, పర్‌ఫామెన్స్‌తో పాటు, తన అందంతోనూ అందర్నీ కట్టి పడేసిన ముద్దుగుమ్మ ఊర్మిళ. అయితే ఈ ముద్దుగుమ్మ గత పదేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే ఇర్ఫాన్‌ఖాన్‌ నటించిన 'బ్లాక్‌ మెయిల్‌' చిత్రంలో 'బేవఫా బ్యూటీ..' అనే స్పెషల్‌ సాంగ్‌ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన ఊర్మిళపై మీడియా పలు ప్రశ్నలు సంధిస్తోంది. 

పెళ్లి తర్వాత కామన్‌గా ఏ హీరోయిన్‌కైనా ఎదురయ్యే ప్రశ్నలే అవి. అయితే పెళ్లి అనేది నా పర్సనల్‌ అనీ, ఆ విషయాలు మీడియాతో ప్రస్థావించాల్సిన అవసరం లేదనీ చెబుతోంది ఊర్మిళ. అంతేకాదు, పెళ్లి తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నాననీ చెబుతోంది. అసలు తాను సినిమాలకు దూరం కాలేదనీ రకరకాల కారణాలతో నచ్చిన కథలు దొరకక సినిమాల్లో నటించే అవకాశం రాలేదనీ ఊర్మిళ చెబుతోంది. ఇకపై తాను వరుసగా సినిమాల్లో నటిస్తాననీ అంటోంది. 

పదేళ్ల గ్యాప్‌ వచ్చినా ఊర్మిళలో అందం ఏమాత్రం తగ్గలేదు. రావడం రావడంతోనే గ్లామరస్‌ లుక్‌లో ఐటెం సాంగ్‌లాంటి స్పెషల్‌ సాంగ్‌లో ఇదివరకటి ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా జోరుగా స్టెప్పులేసి, కుర్రోళ్లు, ముసలోళ్ల గుండె జారి గల్లంతయ్యేలా చేసేసింది. రీ ఎంట్రీలో ఊర్మిళ ఎలాంటి పాత్రలు ఎంచుకుంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

కానీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భాన్ని బట్టి చూస్తే, గ్లామరస్‌ పాత్రలకే ఊర్మిళ సై అనేలా ఉందనిపిస్తోంది. చూడాలి మరి, ఊర్మిళ గ్లామర్‌కి గతంలోలానే అభిమానులు జై కొడతారో లేదో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS