గాయత్రి ఇచ్చిన షాక్ తో మోహన్ బాబు సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.

అయితే అది రాజకీయాలకి సంబంధించి మాత్రం కాదు. ఇక ఆ వివరాల్లోకి వెళితే, మోహన్ బాబు తాజాగా నటించి, నిర్మించిన గాయత్రి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడడంతో మంచు కుటుంబం తీవ్ర నిరాశ చెందినట్టు సమాచారం.

ఇక ఈ ఎదురుదెబ్బతో మోహన్ బాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే- ఇక సమీప భవిష్యత్తులో ఎటువంటి చిత్రాన్ని తాను నిర్మించబోను అని అదే విషయాన్నీ తన ఇద్దరు కుమారుల వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. 

అయితే ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణం గాయత్రి చిత్రం పైన ఆయన పెట్టుకున్న నమ్మకం అలాగే ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్రని అమితంగా ఇష్టపడడం అని కూడా తెలుస్తున్నది.

మొత్తానికి మోహన్ బాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS