కరోనాపై సినిమా.. పిల్ల చేష్టలంటూ విమర్శలు.!

By Inkmantra - March 18, 2020 - 12:07 PM IST

మరిన్ని వార్తలు

ఓ వైపు కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే, మరోవైపు ఈ కరోనాపై సోషల్‌ మీడియాలో కామెడీ ఎక్కువైపోయింది. ఎవరికి తోచినట్లు వారు మీమ్స్‌ తయారు చేస్తూ, స్వల్ప సంతోషం ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే, ఓ నిర్మాణ సంస్థ ఇంకొంచెం ముందడుగేసి, కరోనాపై ఓ సినిమా తెరకెక్కించబోతున్నామంటూ, టైటిల్‌ కూడా రిజిస్టర్‌ చేయించింది. ఇప్పుడందరి నోళ్లలోనూ కరోనా పేరు నానిపోతోంది. అందుకే ‘కరోనా ప్యార్‌ హై’ అంటూ సదరు నిర్మాణ సంస్థ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించి, ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది. కరోనా నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామంటూ కాన్సెప్ట్‌ కూడా రివీల్‌ చేసింది.

 

గతంలో ‘కహోనా ప్యార్‌ హై’ అనే టైటిల్‌తో ఓ క్యూట్‌ లవ్‌ స్టోరీ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్‌ని స్పూర్తిగా తీసుకుని రిజిస్టర్‌ చేయించిన ఈ టైటిల్‌ పలు విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు ప్రపంచం ఆర్ధిక మాంధ్యంలో కూరుకుపోతోంది. మరోవైపు మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్‌, దేశ దేశాల్ని గడగడలాడిస్తూ, చాలా వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ తరుణంలో ‘కరోనా’పై సినిమా అంటూ, సదరు నిర్మాణ సంస్థ చేసిన ప్రకటనను పిల్ల చేష్టలుగా పరిగణిస్తున్నారు. ‘కహోనా ప్యార్‌ హై’ డైరెక్టర్‌ రాకేష్‌ రోషన్‌ కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS