ఈ శుక్రవారం విడుదలైన సినమా `మిస్టర్ మజ్ను`. అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. పాటలు, ప్రచార చిత్రాలూ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తొలి ప్రేమ తరవాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న సినిమా కాబట్టి.. అభిమానులు ఆశలు పెంచుకున్నారు.
కానీ... ఈ సినిమా అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. చాలా మట్టుకు రివ్యూలు నెటిటీవ్ గానే వచ్చాయి. వసూళ్లూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. తొలి రోజు 2.7 కోట్ల షేర్ సాధించిన 'మజ్ను'.. రెండో రోజూ కోలుకోలేకపోయింది. రెండో రోజు 2.58 కోట్లతో సరిపెట్టుకుంది. అంటే తొలి రెండు రోజులకు గానూ.. 5.58 కోట్లు దక్కించుకుందన్నమాట.
ఆదివారం మరో రెండు కోట్లు అనుకుంటే తొలి వారంతంలో రూ.8 కోట్లు కూడా సాధించలేకపోతోందన్నమాట. రూ.24 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుకున్న చిత్రమిది. ఆ అంకెల్ని అందుకోవడం మజ్నుకి కష్టమే. నైజాంలో రూ.6 కోట్లకు అమ్ముడుపోతే ఇప్పటి వరకూ 2 కోట్లు మాత్రమే వసూళ్ల రూపంలో వచ్చాయి. ఓవర్సీస్లో 3.7 కోట్లు అమ్ముడుపోయింది. అక్కడ రూ.1 కోటి రావడం కూడా కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.