స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంత త్వరగా చూద్దాము అన్న ఆత్రుత అల్లు అర్జున్ అభిమానుల్లో తీవ్రంగా కనపడుతున్నది. అలాంటి వాళ్ళ కోసం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోల కోసం నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
దీనికి రెండు రాష్ట్రాలు సుముఖుత వ్యక్తంచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 5 గంటల నుండి స్పెషల్ షోలకి అనుమతి రాగ తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుండి మొదలవుతాయి అన్నట్టుగా ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలువడ్డాయి.
దీనితో ప్రేక్షకులకి ఎల్లుండి ఉదయం 10గంటల వరకు ఈ సినిమా టాక్ బయటకి వచ్చేయనుంది. మరి చూద్దాం.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టించనుందో..