సోషల్ మీడియాలో 'సిక్ మైండ్ రకుల్', చీప్ రకుల్ హ్యాష్ ట్యాగ్‌లతో రకుల్ ప్రీత్‌సింగ్‌కి వ్యతిరేకంగా విపరీతమైన ట్రాలింగ్ జరుగుతోంది. దీనంతటికీ కారణం రకుల్ ప్రీత్‌సింగ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో కనిపించడం, వాటిపై కొంతమంది జుగుప్సాకరంగా కామెంట్స్ చేయడం, అందులో ఓ కామెంట్‌పై రకుల్ ఇంకా జుగుప్సాకరంగా స్పందించడమే. రకుల్‌ని దారుణంగా కామెంట్ చేసిన ఆ వ్యక్తిది తప్పే. ఇందులో వేరే మాటకు తావు లేదు.
సోషల్ మీడియాలో బూతులు సర్వసాధారణం అయిపోయాయి కదా అని ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకోలేం. రకుల్‌కి కోపం రావడంలో అర్ధముంది. అదే సమయంలో ఆ వ్యక్తి తల్లిని ఉద్దేశించి, రకుల్ చేసిన కామెంట్ ఇంకా జుగుప్సాకరం. నిన్న సాయంత్రం వరకూ ఈ అంశంపై ట్రాలింగ్ జరిగింది. ఉదయాన్నే రకుల్ ఇంకో ట్వీట్ వేసింది. నేనెందుకు అలా అనాల్సి వచ్చిందంటే అని చెబుతూ ఆ ట్వీట్‌ని పోస్ట్ చేసింది. అంతే కథ మళ్లీ మొదటికొచ్చింది. అవకాశాలు తగ్గి రకుల్ ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఓ మహిళగా తనకు జరిగిన అన్యాయంపై రకుల్ న్యాయ పోరాటం కూడా చేయొచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే రకుల్ పట్ల సానుభూతి పెరిగేది. ఆమె డైనమిజం బయట పడేది. కానీ ఓ వ్యక్తి తన విషయంలో దిగజారుడు వ్యాఖ్యలు చేశాడని తన తల్లి మీద అంతకన్నా దిగజారుడు వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు మాత్రం రకుల్‌కి లేదు. ఇప్పటికైనా రకుల్ ట్వీట్లకు ఫుల్‌స్టాప్ పెట్టి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మంచిది. ఈ రోజుల్లో వస్త్రధారణ మీద కామెంట్ చేయలేం. కాబట్టి వస్త్రధారణ వల్ల రకుల్ ఈ వివాదంలో ఇరుక్కుందని అనడం కూడా సబబు కాదు.