ఆ సీన్ సెన్సార్ లో కట్ చేస్తారనుకున్నా - నాగార్జున!

మరిన్ని వార్తలు

ఈ మధ్య కథతో సంబంధం ఉన్నా లేకపోయినా.. ఏదో ఓ రకంగా ముద్దులు పెట్టించేస్తున్నారు కొందరు దర్శకులు. మరి కొందరు హీరోలైతే అడిగి మరీ అలాంటి సీన్లు కథలో పెట్టించుకుంటున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా దాదాపు ప్రతి సినిమాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ గా మారిపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఒక ప్రముఖ సెల్లింగ్ పాయింటు అయిపోయింది ఈ ముద్దు. ఇప్పుడంటే ఓకే కానీ 20 ఏళ్ల క్రిందట మన సెన్సార్ బోర్డు చాలా కఠినంగా ఉండేది. తాను నటించిన ఓ చిత్రంలో నుంచి అలాంటి ముద్దు సీన్ ఒకటి కచ్చితంగా సెన్సార్ వాళ్ళు కత్తిరించేస్తారనుకున్నాడట మన మన్మధుడు అక్కినేని నాగార్జున. ఇంతకీ ఏంటా చిత్రం అనుకుంటున్నారా?

 

అక్కడికే వస్తున్నా.. నాగ్ నటించిన 'గీతాంజలి' చిత్రం. అప్పటికీ ఇప్పటికీ బెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పుకోవొచ్చు. ఈ చిత్రం లో హీరో హీరోయిన్ మద్య వచ్చే ముద్దు సీన్ ఎప్పటికి మరువలేనిది. అయితే నాగార్జున మాత్రం ఆ సీన్ కచ్చితంగా సెన్సార్ కట్ అవుతుంది అనుకున్నాడట. తండ్రి 'ఎ.ఎన్.ఆర్' తో కలిసి ఆ సినిమా చూస్తున్నప్పుడు ముందే చెప్పాడట, చిత్రం లో ఒక లాంగ్ సింగల్ టేక్ లిప్ లాక్ సీన్ ఉందని. సినిమా చూసాక 'ఎ.ఎన్.ఆర్' ఆ సీనే సినిమాకి హైలైట్, నిజంగా ప్రేమించిన వాడు ఎవడూ ఆ సీన్ ని కట్ చేయడు అని చెప్పాడట.

 

'మన్మధుడు 2' చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున.. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలు పంచుకున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS