బాలయ్యని మళ్లీ కెలికిన నాగబాబు.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు నాగబాబు సోషల్‌ మీడియాలో ఈ మధ్య తరచూ ఆశక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. నాగబాబు పెట్టే పోస్ట్‌లకు, మెగా అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తోంది. అదే సమయంలో ఈ పోస్టులు కాంట్రవర్సీని సృష్టిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణని టార్గెట్‌గా చేసుకుని నాగబాబు ఈ పోస్టులు చేస్తున్నారని బాలకృష్ణ అభిమానులు ఆరోపిస్తున్నారు. 

 

తాజా వివాదమేంటంటే, ఓ బఫెలో, ఓ డాగ్‌.. ఇలా ఓ నాలుగు ఫోటోలు పెట్టి, వాటి బ్రీడ్‌ గురించీ, వాటి బ్లడ్‌ గురించీ కామెంట్‌ చేశారు. ఇవి ప్రత్యేకమైనవి అనీ, కావల్సినవారు ఆయా వెబ్‌సైట్స్‌ని సంప్రదించాలనీ పోస్ట్‌ పెట్టారు. బాలకృష్ణ గతంలో చేసిన బ్రీడ్‌, బ్లడ్‌ డైలాగులకు ఇది నాగబాబు స్పందన అని కొందరు పేర్కొంటున్నారు. 

 

అయితే దీన్ని వివాదం చేయాల్సిన పని లేదనీ, ఓ సాధారణ పోస్ట్‌గానే పరిగణించాలనీ కొందరు అంటున్నారు. ఇంతకీ నాగబాబు ఉద్దేశ్యం ఏంటో మాత్రం తెలీదు. బాలయ్య ఎవరో నాకు తెలీదు అనడం ద్వారా నాగబాబు బాలయ్య అభిమానులకు టార్గెట్‌ అయ్యారు. ఇప్పుడీ వివాదంతో బాలయ్య అభిమానులు నాగబాబు మీద ఇంకా చెలరేగిపోయే అవకాశముంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS