బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్‌లో ఆల్రెడీ రెండు సినిమాలొచ్చాయి. ఒకటి 'సింహా', రెండోది 'లెజెండ్'. రెండూ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఆ సినిమా గురించి బోయపాటి చెప్పీ చెప్పనట్లుగా, హీరోయిన్లు విప్పీ విప్పనట్లుగా ఓ చిన్న హింట్ ఇచ్చేశాడు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందా.? అని అడిగితే, లేదు పొలిటికల్ టచ్ ఉండదు కానీ, సామాజిక సందేశం నేపథ్యంలో ఉంటుంది.. కానీ అంతర్లీనంగా పాలిటిక్స్ మిళితమై ఉంటాయి అని చెప్పారు.
అంటే బోయపాటి మాటల ప్రకారం ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అయ్యుండొచ్చని ఫ్యాన్స్ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇకపోతే ఈ సినిమాని ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. బోయపాటి, పూరీలతో సినిమాలు చేయడం తనకు హాయిగా ఉంటుందనీ, ఎందుకంటే వీరు నన్ను బాగా అర్ధం చేసుకుని సినిమాలు తీస్తారనీ బాలయ్య అన్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తూ నిర్మించిన 'ఎన్టీఆర్' బయోపిక్ విడుదలకు సిద్ధమైంది.
రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో పార్ట్ 'మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడదుల కానుంది. ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ సహా రకుల్ ప్రీత్‌సింగ్ తదితర పలువురు జూనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. రానా, సుమంత్, కల్యాణ్‌రామ్ తదితర యంగ్ హీరోలు, సీనియర్ నరేష్ తదితర సీనియర్ స్టార్లు నటించారు. క్రిష్ దర్శకత్వంలో ఈ బయోపిక్ రూపొందింది.