చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు.. తెర వెనుక శ్రమించినవాళ్లలో నాగబాబు ఒకరు. ఆ సమయంలో నాగబాబు పోటీ చేయలేదు గానీ, కొన్ని స్థానాల్లో పార్టీని గెలిపించడానికి తన వంతు పాత్ర పోషించారు. జనసేన సమయంలోనూ తను ఓ కార్యకార్యగా పనిచేశాడు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తన సపోర్ట్ పవన్ కల్యాణ్ కే అని చాలాసార్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే నాగబాబు.. యూ ట్యూబ్ వీడియోల రూపంలో తన అభిప్రాయాల్ని చాలాసార్లు జనం ముందుకు తీసుకొచ్చారు. ప్రతీ వీడియోలోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పవన్ ని శ్లాఘించేవారు. కొంతకాలం నుంచీ ఆయన కూడా యాక్టీవ్‌గా లేరు. అయితే 2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. పవన్.. ఇప్పటి నుంచే పార్టీని యాక్టీవ్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా నాగబాబు కూడా రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.
ఈసారి కూడా జనసేన కోసం నాగబాబు శ్రమించబోతున్నారని, గ్రామ స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం, ఎన్నికల ప్రణాళికలు, ఎం.ఎల్.ఏ అభ్యర్థుల్ని ఎంచుకోవడం... ఇలాంటి విషయాల్లో నాగబాబు దృష్టి పెట్టబోతున్నారని సమాచారం. అయితే... ఈసారి ఆయన నిలబడం లేదట. ఎం.ఎల్.ఏ గానూ, ఎంపీగానూ ఏ స్థానం నుంచీ పోటీ చేయాలనుకోవడం లేదని, తెర వెనుకే ఉండిపనిచేయాలన్న నిర్ణయానికి వచ్చారని టాక్. యూ ట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా ప్రచారం. ఇవన్నీ నాగబాబునే చూసుకోబోతున్నారట. సో.. నాగబాబు లక్ష్యం, చేయాల్సిన పనులు.. ముందే ఫిక్సయిపోయాయి. చివరి నిమిషాల్లో ఆయన మనసు మార్చుకుంటే తప్ప.. ఈ ఎన్నికలలో నాగబాబు నిలబడే ప్రసక్తే లేదు.