బూతు సినిమాల నుంచి... విడాకుల వ‌ర‌కూ..?!

మరిన్ని వార్తలు

బాలీవుడ్ న‌టి.. శిల్పా శెట్టి. త‌న భ‌ర్త రాజ్ కుంద్రాతో తెగ‌దెంపులు చేసుకోబోతోంద‌న్న‌ది ఇప్ప‌టి వార్త కాదు. పోర్నోగ్ర‌ఫీ కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన‌ప్ప‌టి నుంచీ ఈ వార్త వినిపిస్తూనే ఉంది. శిల్పాశెట్టి విడాకులు తీసుకోబోతోంద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.సోష‌ల్ మీడియాలోనూ పెద్ద చ‌ర్చ న‌డిచింది. దీనిపై అప్ప‌ట్లోనే శిల్పా.. స‌మాధానం ఇచ్చింది. తాము ఎప్ప‌టికీ క‌లిసే ఉంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

 

అయితే ఈ విడాకుల వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకొచ్చింది. శిల్పా - రాజ్‌లు విడిపోతున్నార‌ని, అందుకు సంబంధించిన తంతు కూడా పూర్త‌య్యింద‌ని స‌మాచారం. అందుకు ఆధారాలూ ఉన్నాయంటోంది బాలీవుడ్ మీడియా. ఇటీవ‌ల రాజ్ కుంద్రా త‌న పేరుమీద ఉన్న కొన్ని కీల‌క‌మైన, విలువైన ఆస్తుల్ని శిల్పా శెట్టి పేరుమీద బ‌ద‌లాయించాడ‌ట‌. వాటి విలువ సుమారు వంద కోట్ల‌కుపైమాటే అని స‌మాచారం. భ‌ర‌ణంలో భాగంగానే ఈ ఆస్తుల పంప‌కం జ‌రిగింద‌ని బాలీవుడ్ లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఈ జంట బాగానే ఉండేది. బాలీవుడ్ లో మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్‌... అన్న‌ట్టు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగేవారు. కానీ పోర్న్ సినిమాలు తీస్తూ ఎప్పుడైతే రాజ్ కుంద్రా అడ్డంగా దొరికిపోయాడో, అప్ప‌టి నుంచే దూరం మొద‌లైంది. బూతు సినిమాల తంతు.. ఆ వ్యాపారం.. ఓ కాపురాన్ని నిలువునా బ‌లి తీసుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS