అక్కినేని నాగచైతన్య 'మజిలీ' హిట్‌తో మంచి హుషారు మీదున్నాడు. వరస పెట్టి, సినిమాలు లైన్లో పెట్టేశాడు. ఈ డిశంబర్‌లో మేనమామ వెంకీతో కలిసి నటిస్తున్న 'వెంకీ మామ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ములతో చైతూ చేయబోయే సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే, ఇంకో సినిమానీ మనోడు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అయితే, ఈ సినిమా కథపై చైతూ సంతృప్తిగా లేడని తెలుస్తోంది. సో ఈ కథని పక్కన పెట్టేశాడనీ ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడు కావడంతో, కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడట చైతూ. అయితే, కొత్త దర్శకుల్లోనే డిఫరెంట్ టాలెంట్ దాగుంటుంది. లక్ కలిసొస్తే, కొత్త దర్శకులు చూపించే కాన్సెప్ట్‌లే ఈ మధ్య ఎక్కువగా వర్క్ అవుట్ అవుతున్నాయి కూడా.
అలాంటిది శశిని చైతూ ఎందుకు పక్కన పెట్టేయాలనుకుంటున్నాడో తెలీదు కానీ, జస్ట్ ఇదో గాలి వార్త అయినా కావచ్చు. అన్నీ కుదిరితే ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. రష్మికా మండన్నా హీరోయిన్గా నటించనుంది. అయితే, నిజంగానే చైతూ, శశికి హ్యాండిచ్చాడా.? లేక స్క్రిప్టులో మార్పులు చేర్పుల అనంతరం సినిమాని పట్టాలెక్కిస్తాడా.? అనేది వేచి చూడాలిక.