బాలకృష్ణ టైటిల్ పై కన్నేసిన నాగశౌర్య

మరిన్ని వార్తలు

తెలుగు యువ హీరోలలో మంచి ఫాలోయింగ్ తో పాటుగా క్రేజ్ కూడా ఉన్న హీరో నాగశౌర్య. ఆయన గత చిత్రం ఛలో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది, అదే జోష్ తో వరుసగా సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.

ఈ తరుణంలో ఆయన ఈమధ్యనే ఒక కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ చిత్రానికి ఒక ఆసక్తికరమైన టైటిల్ ని పరిశీలిస్తున్నారట, ఆ టైటిల్ ఏంటంటే- నారీ నారీ నడుమ మురారి. ఇది బాలకృష్ణ సినిమా హిట్ టైటిల్. ఇప్పటికే నర్తనశాల అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తుండగా ఇప్పుడు మరోసారి ఒక మంచి టైటిల్ పట్టేసాడు అన్న ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన నటించే ఇద్దరు హీరోయిన్లని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుండి మొదలుకానుంది, రాజా కోలుసు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయంకానున్నాడు.

వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS