ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులని ఒక కేసు విషయమై కలిసి వారికి ఒక ఫిర్యాదు చేశాడు.
ఆ ఫిర్యాదు ఏంటంటే- శేఖర్ కమ్ముల కొత్త సినిమాలో నటీనటులు కావాలంటూ అంతర్జాలంలో ఒక ప్రకటన ఇచ్చి ఆ ఆడిషన్ లో పాల్గొనాలంటే ఆడవారు అయితే రూ 1500, మగవారు అయితే రూ 1800 ఎంట్రీ ఫీజ్ కట్టాలి అని చెప్పడంతో శేఖర్ కమ్ముల పేరు చూసి డబ్బు కట్టేసారు. ఆ డబ్బు అందగానే సదరు వ్యక్తి మాయమైపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న శేఖర్ కమ్ముల వెంటనే హైదరాబాద్ పోలీసులని ఆశ్రయించి ఈ ప్రకటనకి తనకి ఎంటువంటి సంబంధం లేదు అలాగే ఈ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని కూడా పట్టుకోమని వారిని కోరాడు.
ఈ మధ్యకాలంలో ఇలా పేరున్న దర్శకుల పేర్లు చెబుతూ, ఆడిషన్స్ అంటూ మోసం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. ఏదేమైనా దర్శకులు కూడా ఇటువంటి వాటి పైన ఒక కన్ను వేసి ఉంచితే మంచిది.