యాక్టింగ్‌ కాదంటున్నాడు కింగ్‌.. నమ్మేద్దామా బాస్‌!

By iQlikMovies - July 11, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

బుల్లితెర వీక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ జూలై 21న ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, స్టార్‌ మా ఓ ప్రోమో విడుదల చేసింది. కింగ్‌ నాగార్జున మరోసారి మ్యాజిక్‌ చేశాడు ఈ ప్రోమో ద్వారా. హౌస్‌లో జరిగేది యాక్టింగ్‌ కాదంటూ.. కొన్ని రిఫరెన్స్‌లు చూపించాడు. చేతిలో ఓ బొమ్మ ఆ బొమ్మ పేరు పండు. ప్రోమోని చాలా బాగా డిజైన్‌ చేశాడు. కానీ, హౌస్‌లో జరిగేది యాక్టింగ్‌ మాత్రమేనని ఆల్రెడీ బలమైన ముద్ర పడిపోయింది. సీజన్‌ 1 సంగతి ఎలా ఉన్నా, సీజన్‌ 2 మాత్రం అరివీర భయంకరమైన యాక్టర్స్‌తో అభాస్‌ పాలైపోయింది. దాంతో యాక్టింగ్‌ కాదు మొర్రో... అన్నట్లుగా మూడో సీజన్‌ కోసం ప్రోమోని వదిలారేమో అన్నట్లుగా అనిపిస్తోంది.

 

షో పై వివాదాలు, విమర్శలూ ఎలా ఉన్నా, బుల్లితెరపై హాటెస్ట్‌ షో ఏంటీ? అంటే మాత్రం బిగ్‌బాస్‌ అని చెప్పక తప్పదు. 14 మంది కంటెస్టెంట్స్‌ 100 రోజుల ప్రయాణం.. అన్నింటికీ మించి కింగ్‌ నాగ్‌ హోస్టింగ్‌ ఈ షో రేంజ్‌ని పెంచేయబోతోంది. కంటెస్టెంట్స్‌ ఎవరు అనేది ఇంకా తేలలేదు. ఆ ఉత్కంఠే షో మీద అంచనాల్ని ఇంకా పెంచేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS