నాగార్జున ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్న సినిమా `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్ని నాయిన`కి ప్రీక్వెల్ ఇది. కథ రెడీ. దర్శకుడు రెడీ. నిర్మాణ సంస్థ తనదే కాబట్టి.. అదీ రెడీ. కానీ... ఈ సినిమాలో మరో హీరో కావాల్సివుంది. ఆ విషయంలోనే నాగ్ తర్జన భర్జనలు పడ్డాడు. నాగచైతన్యతో ఆ పాత్ర చేయించాలన్నది నాగ్ ఆలోచన. చైతూ అందుకు సిద్ధపడినా.. మధ్యలో సమీకరణాలు మరాయి. చేతిలో సినిమాలు పెరగడంతో చైతూపై ఒత్తిడి పెరిగింది. దాంతో బంగార్రాజు సినిమా నుంచి తప్పుకోవాలని చూశాడు.
రామ్, శర్వానంద్ లాంటి పేర్లు కూడా ఆ పాత్ర కోసం పరిశీలించారు. చివరికి చైతూనే ఫిక్సయ్యాడు. ఈ విషయంలో నాగార్జున కూడా ఈ క్లారిటీ ఇచ్చేశాడు. బంగార్రాజులో చైతూ నటిస్తున్నాడని ఆయన ధృవీకరించారు. స్క్రిప్టు ఎప్పుడో సిద్ధమైందని, పట్టాలెక్కడమే ఆలస్యమని.. నాగ్ చెప్పుకొచ్చారు. అంతే కాదు... అఖిల్ తో కూడా ఓ సినిమా ఫిక్సయ్యిందని, అది పూర్తి యాక్షన్ కథ అని నాగ్ హింట్ ఇచ్చారు. సో... త్వరలో అక్కినేని మల్టీస్లారర్లు చూడొచ్చన్నమాట.