టాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించిన సినిమా నాగార్జున - రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'శివ'. నాగార్జున కెరీర్‌ని టర్న్ చేసింది ఈ సినిమా. ఇప్పటికీ, ఎప్పటికీ టాలీవుడ్ సెన్సేషనల్ 'శివ'. అలాంటిది ఈ కాంబినేషన్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. 27 ఏళ్లకి మెచ్యూరిటీ వస్తుందని నాన్నగారు నాతో చెప్పేవారు. అలా 27 ఏళ్లకి 'శివ' సినిమా చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది.
అలాగే మళ్లీ 27 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్‌లో ఈ సినిమా చేస్తున్నాను. అంటే డబుల్ మెచ్యూరిటీ అన్న మాట. ఆ సినిమా కన్నా ఈ సినిమా డబుల్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాననీ నాగార్జున ఈ సందర్భంగా చెప్పారు. 'శివ' సినిమా టైంలోనే నాగార్జున వర్మని ఆడిగారట. టెక్నికల్‌గా ఓ అద్భుతమైన సినిమా చేయాలని.. ఆ మాటకి వర్మ, నాగ్‌కి ప్రామిస్ చేశారట. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ తాజా సినిమా అంటున్నారు.
పక్కా యాక్షన్ మూవీ ఇది అని నాగార్జున గతంలోనే చెప్పారు. అలాగే యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పుష్కలంగా ఉంటుందట. అయితే ఇంతవరకూ యూజ్ చేయని టెక్నికల్ వేల్యూస్‌ని వర్మ ఈ సినిమాతో చూపించనున్నారట. వర్మ సినిమాలన్నీ వాస్తవానికి టెక్నికల్ వండర్స్‌గానే ఉంటాయి. అయితే ఈ సినిమాతో సరికొత్త టెక్నికల్ అంశాల్ని టాలీవుడ్‌కి పరచయం చేయనున్నారట. అలాగే నాగార్జునకి చేసిన ప్రామిస్‌ని కూడా నిలబెట్టుకుంటానంటున్నారు రామ్‌గోపాల్ వర్మ.
ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకుల్ని అలరించడం లేదు. ఈ సినిమాలో వర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాననీ ఆయన నమ్మకంగా చెబుతున్నారు. నాగార్జున కూడా వర్మపై పూర్తి నమ్మకంతోనే ఈ సినిమాలో నటింంచేందుకు ఓకే చేశారు. డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కాన్సెప్ట్ అంతా సరికొత్తగా ఉండబోతోంది ఈ సినిమా.