బిగ్‌హౌస్‌లో 'కింగ్‌' ఎంట్రీ అదిరింది బాస్‌.!

మరిన్ని వార్తలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లితెర మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌ 3' అనుకున్నట్లుగా ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్‌ అయ్యింది. హోస్ట్‌గా నాగార్జునకు చాలా వెయిట్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌ టీమ్‌. స్టార్‌డమ్‌ పరంగా, నలుగురు అగ్రహీరోల్లో నాగార్జునకు తనదైన శైలి గుర్తింపు ఉంది. అంతేకాదు, మా టీవీతో నాగార్జునకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

 

దాంతో బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఆయనకు స్పెషల్‌ వెయిట్‌ ఇచ్చారనిపిస్తోంది. బిగ్‌బాస్‌కి నాగార్జున హోస్టింగ్‌లో సూపర్బ్‌ గ్లామర్‌ దక్కింది. హౌస్‌లో నాగ్‌ తిరిగిన దారుల్ని అందమైన అమ్మాయిల గ్లామర్‌తో నింపేశారు. గత సీజన్స్‌తో పోల్చితే, ఈ సీజన్‌లో మన్మధుడి కోసం స్పెషల్‌గా యాడ్‌ చేసిన కొత్త గ్లామర్‌ ఇది. ఇక ఎంట్రీలో, బిగ్‌బాస్‌ తొలి హోస్ట్‌ ఎన్టీఆర్‌ని 'మా పెద్దబ్బాయ్‌' అనీ, రెండో హోస్ట్‌ నానిని 'నా గోల్డ్‌, మై బ్రదర్‌..'

 

అని నాగ్‌ సంబోధించడం ఆశ్చర్యపరిచింది. ఇక హౌస్‌ విషయానికి వస్తే, గత సీజన్స్‌తో పోల్చితే, ఈ హౌస్‌ని మరింత అందంగా, బ్రైట్‌గా డెకరేట్‌ చేశారు. చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు అబ్బా..! హౌస్‌ ఎంత బాగుందో.. అనుకోకుండా ఉండలేకపోయారు. అందరూ ఊహించిన దానికన్నా, అంతకు మించి అనే రేంజ్‌లో బిగ్‌బాస్‌ ఓపెనింగ్‌ డే నిజంగానే ఓ సెలబ్రేషన్‌లా సాగింది. నాగార్జున ఛలోక్తులు, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ షో గ్లామర్‌ని మరింత గ్లామరస్‌గా మార్చేశాయి. ఎంతైనా మన్మధుడు కదా.!

 

ఆ ఫీల్‌ క్రియేట్‌ చేసేశాడు బిగ్‌బాస్‌కి. మొత్తానికి ఎలాగైతేనేం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, బిగ్‌బాస్‌ 3 స్టార్ట్‌ అయిపోయింది. ఇక బుల్లితెర ప్రేక్షకులకూ, బిగ్‌బాస్‌ ప్రేమికులకూ ప్రతీ రోజూ పండగే. ఇక వీకెండ్స్‌ అయితే, ఆ పండగ డబుల్‌, ట్రిపుల్‌ ధమాకానే. స్టే ట్యూన్‌డ్‌, చూస్తూ, పాలో చేస్తూనే ఉండండి 'బిగ్‌బాస్‌ 3


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS