బిగ్‌బాస్‌'లో ఆ ఇద్దరూ పడ్డారండీ మరి.!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ హిస్టరీలోనే తొలిసారి పెళ్లయిన ఓ జంటను బిగ్‌హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఇంతవరకూ బిగ్‌బాస్‌ చరిత్రలోనే జరగని ఓ అద్భుతం ఇది. బిగ్‌హౌస్‌లో ట్రావెల్‌ చేశాక, లవ్‌లో పడి, ఒకర్ని ఒకరు అర్ధం చేసుకుని, బయటికొచ్చాక పెళ్లి చేసుకున్న వాళ్లు ఉన్నారు. కానీ, ఇలా పెళ్లయిన జంటని లోపలికి పంపించడం మాత్రం ఇదే తొలిసారి. అలా వెళ్లిన తొలి జంటగా వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు జంట అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షింస్తోంది.

 

వీరి ఎంట్రీ కూడా సూపర్బ్‌గా ప్లాన్‌ చేశారు. బిగ్‌బాస్‌ లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ అంటూ ఈ జంటని స్టేజ్‌ పైకి ఇన్‌వైట్‌ చేసి, గ్రాండ్‌గా హౌస్‌ లోపలికి పంపించారు. వరుణ్‌ సందేశ్‌, తన భార్య వితికాని సినిమాటిక్‌గా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడం ముచ్చటగా అనిపించింది. వరుణ్‌, వితికా 'పడ్డానండీ ప్రేమలో మరి' అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లి దాకా చేరింది.

 

అలా వీరిద్దరి వివాహం జరిగింది. బిగ్‌బాస్‌ స్టేజ్‌పై వీరిద్దరి లవ్‌ స్టోరీని చెప్పించి, ఆడియన్స్‌ ఆసక్తికి ఇంకాస్త ఆధ్యం పోశారు నాగ్‌. ఈ జంటను లోపలికి పంపిస్తూ, జంటగా వెళుతున్నారు.. కానీ, ఒంటరిగానే ఆడాలి.. అని చెప్పి పంపించారు. వరుణ్‌ విషయానికి వస్తే, 'హ్యాపీ డేస్‌' సినిమాతో హీరోగా పరిచయమై, పలు చిత్రాల్లో నటించిన యంగ్‌ సెన్సేషన్‌.

 

వితికా విషయానికి వస్తే, అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగుతో పాటు, పలు కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించింది. పెద్దతెరపై నటనతో ఆకట్టుకున్న ఈ జంట, ఇప్పుడు బుల్లితెరపై రియల్‌గా ఎలాంటి ఆటిట్యూడ్‌ చూపించబోతున్నారో, తమ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎన్ని రోజులు హౌస్‌లో ఉండబోతున్నారో ఇకపై చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS