సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. సమయం దొరికితే చాలు కుటుంబంతో గడిపేందుకు ఆయన ఆసక్తి చూపిస్తారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా మహేష్ బెస్ట్ డాడీ అంటూ ఓ లవ్లీ పోస్ట్ పెట్టారు.
గౌతమ్ సితారలతో మహేష్ సరదాగా గడుపుతున్న ఓ ఫోటోను పోస్ట్ చేసిన నమ్రత "మీ నాన్నగారు నీ పట్ల చూపించే మృదు స్వభావం, సహనం, ధైర్యం, ప్రేమ అన్నీ నువ్వు మాపై చూపిస్తావు. తండ్రిగా ఎలా మసలుకోవాలి అనేదానికి నువ్వో ఉదాహరణ. నీ పిల్లలకు నువ్వో బెస్ట్ డాడీవి. నీ కుటుంబం కోసం, మమ్మల్ని కాపాడడం కోసం, మాకు ఓ పిల్లర్ లాగా సపోర్ట్ గా నిలబడడం కోసం నువ్వు నీ పరిధి దాటి మరీ ప్రయత్నిస్తున్నందుకు కృతజ్ఞతలు. మా ప్రపంచాన్నిప్రతిరోజూ నువ్వెంతో అందంగా మారుస్తావు. హ్యాపీ ఫాదర్స్ డే ఎంబీ. వీ లవ్ యూ" అంటూ ఎంతో అందంగా తన భావాలను వ్యక్తీకరించారు.
ఇక ఫోటోలో మహేష్ బాబు ఒళ్లో గౌతమ్ పడుకుని ఉంటే, సితార గౌతమ్ వెనకాలే పడుకుని నాన్న చేతిని పట్టుకుని ఓ క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఫోటో మాత్రం అదిరిపోయింది. ఇక నెటిజన్లు మహేష్ ను 'ది బెస్ట్ ఫాదర్' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.