తమిళ్‌కి ఓకే, తెలుగులో నాట్‌ ఓకే అంటోన్న ముద్దుగుమ్మ!

మరిన్ని వార్తలు

హీరోయిన్స్‌కి అందం తప్పనిసరి. అయితే అందం వేరు, గ్లామర్‌ వేరు. అందంగానూ కనిపించాలి. గ్లామర్‌లో మొహమాటాలుండకూడదు ముద్దుగుమ్మలకు. అప్పుడే అవకాశాలు జోరుగా అందుకుంటాయి. కానీ, ముద్దుగుమ్మ నందితా శ్వేత అందం గురించి ఏమంటోందో తెలుసా? టాలీవుడ్‌కే అందంతో పని కానీ, కోలీవుడ్‌లో అందంతో పని లేదంటోంది. అంటే, ఆమె మీనింగ్‌ ఏంటంటే, అక్కడ డీ గ్లామర్‌లో కనిపించినా హీరోయిన్స్‌ని ఇష్టపడతారు. కానీ, తెలుగులో వన్స్‌ డీ గ్లామర్‌ రోల్‌ చేస్తే ప్రేక్షకుల ఆదరణ పొందడం కష్టమే అంటోంది.

 

డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించాలంటే, దానికి స్టార్‌ వేల్యూ తప్పనిసరి అంటోంది. డెబ్యూ భామలు ప్రయోగాలు చేస్తామంటే ఇక్కడ చెల్లుబాటు కాదంటోంది. అయితే గ్లామర్‌ విషయంలో అమ్మడి అభిప్రాయమేంటంటే పెద్దగా హద్దులున్నట్లేం కనిపించడం లేదు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో ట్రెడిషనల్‌గానే కనిపించినా, 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమాలో కాస్త హాట్‌గా కనిపించింది నందితా శ్వేత. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అభినేత్రి 2'లో నందితా శ్వేత విచ్చలవిడిగా అందాలారబోసింది.

 

దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. కానీ, సక్సెస్‌ అయ్యి ఉంటే, ఇంకోలా ఉండేది. ఇంతవరకూ ఎక్కువ దెయ్యం పాత్రల కోసం, హోమ్లీ క్యారెక్టర్స్‌ కోసమే నందితాని ఎంచుకున్నారు. కానీ, 'అభినేత్రి 2' చూశాక గ్లామర్‌ రోల్స్‌కీ పాప సై అని తెలిసింది. తమన్నాతో కలిసి పోటీ పడి మరీ అందాల విందు చేసేసింది. ఈ సంగతిలా ఉంచితే, ప్రస్తుత నందితా చేతిలో ఐదారు ప్రాజెక్టుల వరకూ ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో 'అక్షర' తదితర సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS