దెయ్యం పిల్ల కాంట్రవర్సీ కానుందా?

By iQlikMovies - June 01, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నందితా శ్వేత. తొలి సినిమాకే ఎన్నో సినిమాల అనుభవం ఉన్న నటిలా నటించి మెప్పించింది. దెయ్యం పాత్రలో అంతగా పరకాయ ప్రవేశం చేసింది నందితా శ్వేత. ఈ సినిమాలో ఆమె దెయ్యం నట విశ్వరూపానికి ఆ తర్వాత కూడా చాలా పాత్రలు అదే తరహాలో రావడం విశేషం. 'ప్రేమకథా చిత్రమ్‌ 2', 'అభినేత్రి 2'.. ఇలా పలు చిత్రాల్లో నందితాకి దెయ్యం పాత్రలు వరించాయి. అయితే తొలి సినిమా ఇచ్చిన కిక్కు ఈ సినిమాలు ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం నందితా చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. వాటిలో చెప్పుకోదగ్గది 'కల్కి'.

 

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితాతో పాటు, ఆదాశర్మ కూడా నటిస్తోంది. అయితే నందితా పాత్ర కాస్త క్రిటికల్‌గా ఉండబోతోందట. 'అనీషా' అనే ముశ్లిం అమ్మాయి పాత్రట అది. ఆ పాత్ర చుట్టూ చాలా కాంట్రవర్సీలుంటాయట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పాత్రను డిజైన్‌ చేశారట. అందుకే అనీషా పాత్ర తనకు వెరీ వెరీ స్పెషల్‌ అంటోంది. ఈ సినిమా కోసం చాలా చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాననీ చెబుతోంది నందితా శ్వేత. 'అ' ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS