జిగేల్‌రాణి సందడి భలేగుందే.!

మరిన్ని వార్తలు

పూజాహెగ్డే చేతిలో బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నా ప్రస్తుతం వార్తల్లో ఎక్కడా పూజా పేరు వినిపించడం లేదు. అందుకే అభిమానులకు తాను గుర్తున్నానో లేదో అని టెస్ట్‌ చేస్తోంది కాబోలు. 'అరవింద సమేత' సినిమా షూటింగ్‌ టైంలో జరిగిన ఫన్నీ వీడియోలు పోస్ట్‌ చేసి, నెటిజన్స్‌కి టెస్ట్‌ పెట్టింది. ఆ టెస్ట్‌లో నెటిజన్లు పాస్‌ అయ్యారులెండి. వ్యూస్‌ బాగానే వచ్చాయి అమ్మడికి. 

 

ఇంతకీ పూజా ఏం చేసిందంటే, అరవింద సమేత సినిమా స్విట్జర్లాండ్‌లో షూటింగ్‌ జరిగిన టైంలో ఫ్రీ టైంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే సైకిల్‌ తొక్కుతూ సరదాగా లేక్‌ పక్కన ఎంజాయ్‌ చేసేవారట. ఆ టైంలో జరిగిన ఫన్నీ సంగతుల్ని గుర్తు చేసుకుని ఆ ఫన్నీ వీడియోస్‌ని సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంది. 'మహర్షి' సినిమాలో మహేష్‌కి జోడీగా నటిస్తున్న పూజాకి సంబంధించి పెద్దగా అప్‌డేట్స్‌ ఏమీ లేవు. కానీ ఇటీవల మహేష్‌తో కలిసి రొమాంటిక్‌ యాంగిల్‌లో ఉన్న పూజా ఫోటో మాత్రం బయటికి వచ్చింది. ఆమె సోలో స్టిల్స్‌ ఇంతవరకూ రిలీజ్‌ కాలేదు. 

 

అలాగే ప్రబాస్‌తో పూజా నటిస్తున్న సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. సో ఆ అప్‌డేట్‌ కూడా ఏం లేదు. బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఎన్ని ఉన్నా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిస్తేనే కదా అసలు సిసలు మజా. మరి ఆ మజా జిగేల్‌రాణికి ఎలా వస్తుంది చెప్మా. అందుకే ఇలా పబ్లిసిటీ స్టంట్‌ చేస్తుంది కాబోలు. చక్కనమ్మ ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అందుకే పూజా తాజా పోస్ట్‌లకు ఫ్యాన్స్‌ పోటెత్తుతున్నారు. అన్నట్లు మన జిగేల్‌ రాణి బాలీవుడ్‌లో 'హౌస్‌ఫుల్‌ 4'లో కూడా నటిస్తోందండోయ్‌. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS