బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షో తెలుగులో రావడమే ఒక సాహసం. ఎందుకంటే బిగ్ బాస్ వంటి షో తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా అనేది మీమాంసల నడుమ మొదటి సీజన్ రావడం దానికి ఎన్టీఆర్ తనదైన శైలిలో నడపడంతో అది సూపర్ హిట్ అయింది.
ఇక రెండవ సీజన్ కివచ్చేసరికి, ఎన్టీఆర్ సినిమాలతో బిజీ అయిపోవడంతో ఆ స్థానంలోకి నాని వచ్చాడు. ఇక దీనికి సంబంధించి ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ జరగడం, అందులో ఒకరు “మీరు కూడా ఎన్టీఆర్ లాగా షోలో చికెన్ వండుతారా” అని ప్రశ్నించగా- “నాకు ఆమ్లెట్ వెయ్యడం కూడా రాదు, అయితే కావాలంటే తారక్ నే ఒకసారి బిగ్ బాస్ హౌస్ కి తీసుకొచ్చి చికెన్ చేయిద్దాం” అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
సమాధానం వరకు ఫన్నీగానే ఇచ్చినా, నిజంగా ఎన్టీఆర్ గనుక సీజన్ మధ్యలో ఒక్కసారి అలా గెస్ట్ గా వస్తే అదిరిపోతుంది అని అందరు తమ తమ అభిప్రాయలు వ్యక్తపరుస్తున్నారు.
మరి చూడాలి.. నిజంగా తారక్ వచ్చి చికెన్ చేసి పెడతాడా లేదా అని...