ప్రమోషన్స్‌ షురూ చేసిన 'గ్యాంగ్‌లీడర్‌'.!

మరిన్ని వార్తలు

సెప్టెంబర్‌ 13న నేచురల్‌ స్టార్‌ నాని నటించిన 'గ్యాంగ్‌ లీడర్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం 'సాహో' మేనియా ఫుల్‌ డోస్‌లో నడుస్తోంది. ఈ సినిమాని కాదని మరో సినిమా వైపు దృష్టి మళ్లే అవకాశమే లేదు. కానీ, అనూహ్యంగా నాని లైన్‌లోకి దిగాడు. సందట్లో సడేమియా అంటూ తన సినిమాని ప్రమోట్‌ చేస్తున్నాడు. అదేంటీ.. నాని ఇప్పుడు లైన్‌లోకి వచ్చాడు.. అని ఆశ్చర్యపోవచ్చు. అయితే, సినిమా రిలీజ్‌ టైంలో నానికి అమెరికా స్పెషల్‌ టూర్‌ ఉందట.

 

షూటింగ్‌ నిమిత్తమో, లేక మరేదైనా పర్సనల్‌ వర్క్‌ గురించో తెలీదు కానీ, సినిమా విడుదల టైంలో తాను ఇక్కడ ఉండలేకపోతున్నాననీ, అందుకే ప్రమోషన్స్‌ షురూ చేసినట్లు తెలిపాడు. నిజానికి 'గ్యాంగ్‌లీడర్‌' ప్రమోషన్స్‌కి ఇదే అసలు టైం. ఎందుకంటే, ఆగస్ట్‌ 30న 'గ్యాంగ్‌లీడర్‌' రిలీజ్‌ డేట్‌ని ఎప్పుడో లాక్‌ చేసింది చిత్ర యూనిట్‌. అయితే, అనూహ్యంగా ఆ డేట్‌ని 'సాహో' సొంతం చేసుకోవడంతో, ఇరకాటంలో పడ్డ నాని ఎట్టకేలకు సెప్టెంబర్‌ 13 ఫిక్స్‌ చేసుకున్నాడు. మొదట ఫిక్స్‌ చేసుకున్న రిలీజ్‌ డేట్‌ బేస్‌ చేసుకుని, అమెరికా టూర్‌ ప్లాన్‌ చేసుకున్నాడు.

 

ఇదంగా ముందుగానే జరిగిన ప్లానింగ్‌ కాబట్టి, అనుకోకుండా, సినిమా వాయిదా పడేసరికి ప్రమోషన్స్‌లో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే అప్పుడే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశాడు. ఇకపోతే, నాని, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో 'వి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బహుశా ఈ సినిమా షూటింగ్‌ కోసమే నాని యూఎస్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకొని ఉండొచ్చు. ఏది ఏమైతేనేం, 'సాహో'తో పాటు, నాని 'గ్యాంగ్‌ లీడర్‌'పై కూడా కూసింత దృష్టి పెట్టేస్తే పోలా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS