బాలీవుడ్‌లో ప్ర‌భాస్ మల్టీస్టార‌ర్‌

మరిన్ని వార్తలు

బాహుబ‌లితో బాలీవుడ్‌ని ప‌ల‌క‌రించాడు ప్ర‌భాస్. ఇప్పుడు సాహోతో మ‌రోసారి అక్క‌డ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ హిందీలోనూ డ‌బ్బింగ్ చెప్పుకున్నాడు. ప్ర‌భాస్‌కి అక్క‌డ ల‌భిస్తున్న ఆద‌ర‌ణ దృష్ట్యా ఇక మీద‌ట హిందీ సినిమాల‌పైనా ప్ర‌భాస్ దృష్టి పెట్టాల్సివ‌స్తోంది. సాహో గ‌నుక హిందీలోనూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌గ‌లిగితే - ఇక మీద‌ట బాలీవుడ్ నుంచి ప్ర‌భాస్‌కి భారీ ఆఫ‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

 

అయితే ప్ర‌భాస్ మాత్రం హిందీలో సోలోగా కాకుండా.. మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలంటే త‌న‌కు ఇష్టమ‌ని, బాలీవుడ్‌లో ఈ త‌ర‌హా సినిమాల‌కు గిరాకీ బాగా ఉంద‌ని ప్ర‌భాస్ చెబుతున్నాడు. టాలీవుడ్‌లో సినిమాలు ఆపి, బాలీవుడ్‌లో సినిమా చేయాలంటే.. క్రేజీ క‌థ రావాలని, మంచి కాంబినేష‌న్ కుదిరితే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెబుతున్నాడు ప్ర‌భాస్‌. సో.. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ నుంచి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రావొచ్చ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS