నానిగారూ.! కాస్త కోపం తగ్గించరూ.!

మరిన్ని వార్తలు

వెండితెరపై తనదైన శైలి సహజ నటనతో నేచురల్‌ స్టార్‌, పక్కింటబ్బాయి అనిపించుకున్న నాని ప్రస్తుతం బుల్లితెర మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే పెద్ద తెరపై అందరి మన్ననలు అందుకున్న నాని, బుల్లితెరపై ఆ స్థాయిలో ప్రశంసలు దక్కించుకోవడంలో విపలమయ్యాడనిపిస్తోంది. 

మొదట్లో చాలా లైట్‌గా ప్రారంభమైన నాని గ్రాఫ్‌ రెండో వారానికి వచ్చేసరికి కాస్త పెరిగింది. మూడో వారానికి వచ్చేసరికి హౌస్‌ మేట్‌ కిరీటి ఇష్యూ కారణంగా మళ్లీ డౌన్‌ ఫాల్‌ అయ్యింది. ఇక నాలుగో వారం నాని కోపం బాగా పెరిగిపోయింది. వెండితెరపై ఫైట్లు, పాటలు తదితర సీరియస్‌ మూడ్స్‌లో కూడా ఎంటర్‌టైన్‌ చేసే నాని, బిగ్‌బాస్‌ హోస్ట్‌గా హౌస్‌ మేట్స్‌ని దారిలో పెట్టేందుకు, హౌస్‌లో వారి వారి ప్రవర్తన విషయంలో ఇచ్చే సూచనలు, సలహాల విషయంలో కాస్త కటువుగా ప్రవర్తిస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. 

'బిగ్‌బాస్‌' మొదటి సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌ వీకెండ్‌లో వచ్చిన రెండు రోజుల్లోనే షో స్వరూపం మార్చేసేవాడు. తనదైన శైలి ఎంటర్‌టైన్‌మెంట్‌తో టీవీల ముందు ఆడియన్స్‌ని కట్టిపడేసేవాడు. చమత్కారి మాటలతో మంట పుట్టకుండానే వేడి వేడిగా చురకలు అంటించేవాడు. వీక్‌ మొత్తానికి సరిపడా జోష్‌ ఆ రెండు రోజుల్లోనే పుష్కలంగా అందేసేది ఆడియన్స్‌కి. కానీ నాని తీరు.. పూర్తిగా సీరియస్‌ మూడ్‌లోకి వెళ్లిపోవడం, ఒక్కోసారి హౌస్‌ మేట్స్‌ని బ్లేమ్‌ చేయడం ( కిరీటీ ఇష్యూ ) దాకా వెళ్లిపోతోంది. 

దాంతో నాని వీకెండ్స్‌ని అంత బ్రైట్‌గా డిజైన్‌ చేయలేకపోతున్నాడు తన ఆటిట్యూడ్‌తో అనిపిస్తోంది. ఈ కారణంగా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ ఆగ్రహానికి గురి కావడంతో పాటు, ఆడియన్స్‌ దృష్టిలో కూడా మంచి మార్కులు వేయించుకోలేకపోతున్నాడు. ఏవండోయ్‌ నానీ గారూ ఈ విషయాన్ని కాస్త గమనించరూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS