'నిన్ను కోరి' తరవాత నాని - శివ నిర్వాణ మరోసారి జట్టు కట్టారు. 'టక్ జగదీష్' కోసం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే నాని బిజీగా ఉన్నాడు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది అన్నదమ్ముల మధ్య జరిగే కథ అట. నాని అన్నగా జగపతిబాబు నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమాకీ పాత 'బలరామకృష్ణులు'కీ పోలిక ఉందని సమాచారం. రాజశేఖర్ - శోభన్‌బాబు నటించిన సినిమా అది. వాళ్లిద్దరి మధ్య పంతం, పగలు చివరికి ప్రేమగా మారడమే కథ. ఈ కథ కూడా అలానే ఉంటుందని సమాచారం. నాని, జగపతిబాబులకు క్షణం కూడా పడదని, అయితే చివరికి వాళ్లు ఎలా కలిశారన్నదే కథ అని తెలుస్తోంది. పాత కథలకు ఈమధ్య పాలీషులు చేసి బాగానే వాడుకుంటున్నారు. త్రివిక్రమ్ ఇంటిగుట్టు కథని 'అల వైకుంఠపురములో'గా మలచి హిట్టు కొట్టాడు. ఇప్పుడు 'బలరామకృష్ణులు'వంతొచ్చినట్టుంది.