నాని ఊర మాస్‌ అండ్‌ సూపర్‌ క్లాస్‌

మరిన్ని వార్తలు

ఈ మధ్య నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన టాలెంట్‌ చూపించాడు. గతేడాది వరుసగా హిట్‌ మీద హిట్‌ కొట్టిన నాని, తాజాగా 'కృష్ణార్జున యుధ్దం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని సెకండ్‌ ఆడియో సింగిల్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. 

ఈ ఆడియో సింగిల్‌లో నాని డ్యూయల్‌ రోల్‌లో ఇద్దరు ముద్దుగుమ్మలతో కూల్‌గా రొమాన్స్‌ చేస్తున్నట్లుగా ఉన్న స్టిల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. 'జెంటిల్‌మెన్‌' సినిమాలో నాని ద్విపాత్రాభినయంలో కనిపించాడు. అందులో ఓ పాత్రలో నెగిటివ్‌ షేడ్స్‌ని చూపించి ప్రశంసలు అందుకున్న నాని, ఈ సినిమాలో పూర్తిగా ఓ పాత్రలో మాస్‌ అప్పీల్‌నీ, ఇంకో పాత్రలో క్లాస్‌ అప్పీల్‌ని పోషిస్తున్నాడు. ఓ పాత్ర కోసం లుంగీ కట్టి, పల్లెటూరి వాతావరణంలో మాస్‌ లుక్‌లో నాని అదరగొట్టేస్తున్నాడు. మరో పాత్రలో క్లాస్‌ లుక్‌లో కాస్ట్‌లీ లొకేషన్స్‌తో దుమ్ము లేపేస్తున్నాడు. 

ఇదిలా ఉండగా, నానికి ఈ బర్త్‌డే చాలా ప్రత్యేకం. హీరోగా హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతూ, సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ అనిపించుకుంటున్న నాని ఈ ఏడాది నిర్మాతగా కొత్త అవతారమెత్తి 'అ' చిత్రాన్ని నిర్మించి, అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించాడు. తన అభిరుచిని చాటుకున్నాడు. పుట్టినరోజు సందర్భంగా నానికి సోషల్‌ మీడియాలో విషెస్‌ వెల్లువెత్తాయి. 

పలువురు సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు వరుస పెట్టి నానికి బర్త్‌డే విషెస్‌ అందిస్తున్నారు. కొత్తగా నిర్మాతగా మారిన నాని నిర్మాణంలో మరిన్ని మంచి చిత్రాలు రావాలనీ, హీరోగా ఇలాగే సక్సెస్‌లు అందుకుంటూ ఉండాలనీ ఆశిస్తూ, మన నానికి మనం కూడా హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దామా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS