నాని-ఇటు హీరోగానే కాకుండా అటు నిర్మాతగా కూడా ‘అ’ చిత్రంతో ఒక మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ తరుణంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆయనకీ ఒక మంచి ఛాన్స్ వదులుకునేటట్టు చేసింది అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
అదేంటంటే- దర్శకుడు కిశోరే తిరుమల ఈమధ్యనే ఒక కథని హీరో నానికి చెప్పడం అది నచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన వద్ద డేట్స్ లేకపోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. అయితే ఈ అవకాశం మెగా హీరోఅయిన సాయి ధరం తేజ్ కి దక్కిందట.
నాని తప్పుకున్నాక ఆ స్థానంలోకి సాయి వచ్చాడట. అయితే తేజుకి కూడా వేరే చిత్రాలు ఉన్నప్పటికీ ఈ కథ తెగ నచ్చడంతో ఎలాగైనా సరే వదులుకోవద్దు అని ఈ చిత్రం కోసం డేట్స్ సర్దే పనిలో పడ్డాడట.
ఇదంతా తెలిసిన వారు మాత్రం తిరుమల కిశోరే చెప్పిన కథలో బలం ఉంది అని అది మిస్ చేసుకోవడం నాని బ్యాడ్ లక్ అని అనుకుంటున్నారు.