నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన చిత్రం `జెర్సీ`. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. రివ్యూలు అదిరిపోయాయి. `క్లాసిక్ సినిమా` అంటూ విశ్లేషకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తొలి రోజు వసూళ్లు కూడా అదిరిపోయాయి. అయితే శని, ఆదివారాలు కాస్త ఆ వేగం తగ్గింది.
తొలి మూడు రోజుల్లో 10.70 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 26 కోట్లకు జెర్సీ సినిమా అమ్మేశారు. దాదాపు 30 శాతం రికవరీ అయ్యింది. ఏ సెంటర్లలో, మల్టీప్లెక్స్‌లలో జెర్సీ సినిమాకి వసూళ్లు బాగున్నాయి. బీసీలలో కాంచన డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. జెర్సీ సోలో రిలీజ్ అయితే... మరింత మెరుగైన ఫలితం వచ్చుండేదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
నైజాంలో అత్యధికంగా రూ.5 కోట్లు వసూలు చేసింది జెర్సీ. సీడెడ్‌లో 1 కోటి వచ్చింది. మిగిలిన ఏరియాల్లో వసూళ్లు కాస్త మందగించాయి. ఈస్ట్‌లో 86 లక్షలు, వెస్ట్ లో 68 లక్షలకు పరిమితమైంది. ఓవర్సీస్ వివరాలు ఇంకా రావాల్సివుంది. మొత్తానికి జెర్సీకి సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలు కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ కనీసం 60 శాతం వసూళ్లు వచ్చినా సరిపోతుంది. మరి... ఏమవుతుందో చూడాలి.