నాని వెర్సస్‌ లారెన్స్‌: బాక్సాఫీస్‌ విన్నర్‌ ఎవరో.!

By Inkmantra - April 18, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

ఈ సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు చిత్రాలూ 'మజిలీ', 'చిత్రలహరి' సోలోగానే ఫైట్‌కి దిగాయి. గుడ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌కి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ వారం మాత్రం రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వార్‌కి సిద్దమయ్యాయి. అవే 'జెర్సీ', కాంచన 3' సినిమాలు. యంగ్‌ హీరో నాని 'జెర్సీ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎమోషనల్‌ టచ్‌తో సాగే యూత్‌ ఇన్‌స్పైరింగ్‌ కంటెన్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బజ్‌ చాలా బాగుంది. నాని నటన, ఎమోషనల్‌ సన్నివేశాలూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

 

ట్రైలర్‌లో ఆయా సన్నివేశాల్ని కట్‌ చేసిన విధానం సినిమాపై అన్ని వర్గాల వారికీ ఆశక్తిని పెంచింది. 'మళ్లీ రావా' ఫేం గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకుడు. నాని సరసన హీరోయిన్‌గా నటించిన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్‌ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇకపోతే లారెన్స్‌ రాఘవ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కాంచన 3' సినిమాపైనా ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఈ సిరీస్‌లో వచ్చిన గత మూడు చిత్రాలూ బాక్సాఫీస్‌ వద్ద స్పెషల్‌ రెస్పాన్స్‌ అందుకున్న దర్మిలా తాజా సీక్వెల్‌ 'పైనా బాగానే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. 

 

ఈ సినిమాకి ముగ్గురు ముద్దుగుమ్మలు ఓవియా, వేదిక, నిక్కీ తంబోలీల గ్లామర్‌ అదనపు ఆకర్షణ కానుంది. కథా, కథనాల ప్రకారం ఈ రెండు సినిమాలూ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. 'జెర్సీ' ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ కాగా, 'కాంచన 3' హారర్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌ (గ్లామర్‌ పాళ్లు ఎక్కువే). సో బాక్సాఫీస్‌ వద్ద ఈ వారం హారర్‌ గ్లామర్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌.. ఈ రెండింట్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS