ఇంద్రగంటి కోసం విలన్‌గా మారిన నాని.?

By Inkmantra - February 20, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

హీరోగా తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ నాని. అయితే ఈ సారి ఇంద్రగంటి కోసం విలన్‌ అవతారమెత్తబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. 'అష్టా చెమ్మా' సినిమా తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'జెంటిల్‌మెన్‌' మూవీ కూడా మంచి విజయం అందుకుంది. నిజానికి ఆ సినిమాలోనే నానిని నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో చూపించేశాడు. 

 

కానీ ఆ సినిమాకి నాని విలన్‌ కాదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌ సెట్స్‌ మీదికెళ్లనుందట. ఈ సినిమాలో నాని పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నాడనీ సమాచారమ్‌. పక్కింటబ్బాయ్‌లా కనిపించే నాని కోరిక కూడా అదే. పూర్తి స్థాయి విలన్‌గా తన సత్తా చూపించాలని. ఆ కోరిక తనకిష్టమైన డైరెక్టర్‌ ఇంద్రగంటితోనే తీరబోతోందనిపిస్తోంది. 

 

సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఇద్దరు తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా నటించనున్నారనీ తెలుస్తోంది. అయితే వారి పేర్లింకా బయటికి రాలేదు. కానీ ఇంద్రగంటి తన సినిమాల కోసం ఎక్కువగా తెలుగు వాళ్లనే ప్రిఫర్‌ చేస్తుంటాడు. ఆ యాంగిల్‌లో ఈ సినిమా కోసం ఏ తెలుగమ్మాయిలు ఆ అదృష్టం దక్కించుకుంటారో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS